Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవుడి ప్రసాదాలపై కూడా జీఎస్టీ.. భారం భక్తుడిపైనే....

గురువారం, 1 మార్చి 2018 (09:24 IST)

Widgets Magazine
laddu

పండు, అది లేకుంటే ఓ పువ్వు, అదీ దొరక్కుంటే ఓ ఆకు సమర్పించినా దేవుడు ప్రసన్నమవుతాడని పురాణాలు చెపుతున్నమాట. కానీ ఇప్పుడు చేతి చమురు వదిలించుకుంటేనాగానీ దేవుడిని చూసేందుకు అనుమతించబోమని కేంద్రంలోని బీజేపీ పాలకులు తేల్చి చెప్పారు. ఫలితంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పోటు దేవుడి ప్రసాదాలను కూడా తాకింది. దేశంలో నివసించే ప్రతి పౌరుడుపైనే కాదు.. భక్తుడిని కూడా వదిలిపెట్టేది లేదని బీజేపీ పాలకులు తేల్చి చెప్పారు. ఫలితంగా దేవుడి ప్రసాదాలపై కూడా ఈ భారం తప్పలేదు. అయితే, ఈ జీఎస్టీ భారాన్ని భక్తుడిపైనే వేయాలని ఆలయాల పాలక మండళ్లు నిర్ణయించాయి. 
 
అష్టోత్తరం చేయించినా, హారతి సమర్పించినా ఆర్జిత సేవల రూపంలో జీఎస్టీ కన్ను పడుతోంది. కల్యాణోత్సవాలు, వ్రతాలు, సువర్ణ పుష్పార్చనలు.. ఒకటేమిటి దేవాలయాల్లోని ఆర్జిత సేవలన్నింటిపై 18 శాతం మేర పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రసాద సరుకులు కొన్నప్పుడు మళ్లీ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. అంటే ఆ మేర ధరలు పెరిగిపోయాయి. 
 
ఇక రూ.1,000, అంతకంటే ఎక్కువ రుసుము ఉన్న కాటేజీలపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో ఈ మొత్తాన్ని ఆ దేవాలయం ఆదాయంలోంచి చెల్లించాల్సి వస్తోంది. ఈ భారాన్ని భక్తులపైనే వేస్తామని ప్రభుత్వానికి నివేదించి, అనుమతి పొంది ధరలు పెంచేస్తున్నాయి. జీఎస్టీ భారంతో ఇప్పటికే యాదాద్రి, భద్రాచలంలో ప్రసాదాల ధరలు రూ.5 చొప్పున పెంచారు. మిగతా దేవాలయాల్లోనూ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల ధరలూ పెంచాలని దేవాదాయ శాఖను దేవాలయాలు కోరాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

హోళీ రంగుల్లో ఆ నాలుగు వేటిని సూచిస్తాయో... తెలుసా?

హోళీ పండుగను జరుపుకునేందుకు గల కారణం చెప్పే మరో కథ వాడుకలో వుంది. పార్వతీపరమేశ్వరుల ...

news

హోళిక అనే రాక్షసి అలా చచ్చింది.. అందుకే హోళీ పండుగ వచ్చిందా?

హోళీ పున్నమి మార్చి 2 (శుక్రవారం) రానుంది. ప్రతి ఏడాది రంగపంచమి అదే హోళీ రోజున భగవంతుడైన ...

news

భారతంలో హంస-కాకి... కర్ణుడికి శల్యుడు చెప్పిన కథ

పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడు ...

news

హోలీ రంగులు... ప్రతి రంగుకీ ఓ కథ వుంది...

హోలీ పండుగనాడు రంగులను కలగలిపి ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. ఈ ...

Widgets Magazine