బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:17 IST)

రామసేతుపై అధ్యయనం చేసేది లేదు.. వెనక్కి తగ్గిన ఐసీహెచ్ఆర్

రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి సహజంగా ఏర్పడిందా లేదని నిర్మించినదా అనే దానిపై నిర్వహించనున్నట్లు గత ఏడాది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్ఆర్) సంస్థ ప్రకటన చేసింది. అయితే రామసేతు మానవ న

రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి సహజంగా ఏర్పడిందా లేదని నిర్మించినదా అనే దానిపై నిర్వహించనున్నట్లు గత ఏడాది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్ఆర్) సంస్థ ప్రకటన చేసింది. అయితే రామసేతు మానవ నిర్మితమా లేకుంటే సహజంగా ఏర్పడిందా అనే దానిపై తాము అధ్యయనం నిర్వహించట్లేదని ఐసీహెచ్ఆర్ ప్రస్తుతం తేల్చి చెప్పేసింది. 
 
దీనిపై ఐసీహెచ్ఆర్ నూతన చైర్ పర్సన్ అరవింద్ జమ్ కేద్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ చరిత్రకారుడి నుంచి అధ్యయనం చేపట్టాలన్న ప్రతిపాదన అయితే ఉందని.. అయితే దీనిపై కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. 
 
వారు చాలా ఆగ్రహంతోను ఉన్నారని.. తాము అధ్యయనం చేయబోవట్లేదని.. అలాగే వేరేవరైనా చేస్తే వారికి నిధుల సాయం కూడా అందించబోమని జమ్ కేద్కర్ తెలిపారు. ఈ విధమైన అధ్యయనాలు చేపట్టడానికి ఆర్కియలాజికల్ సర్వే ఉందని.. పరిశీలించాలని ఐసీహెచ్ఆర్ సూచన మాత్రమే చేయగలదన్నారు.
 
ఇదిలా ఉంటే.. భారత్, శ్రీలంక మధ్య ఉన్న రామసేతు వానరులతో కలసి శ్రీరాముడు నిర్మించారని హిందువులు విశ్వసిస్తారు. మెజార్టీ భారతీయుల వాదనకు బలం చేకూర్చేలా.. ఇది మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానెల్ ఇటీవల వెల్లడించింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, అక్కడి రాళ్లు ఎవరో పేర్చినట్లుగా ఉన్నాయని ఆ ఛానెల్ పేర్కొన్న సంగతి విదితమే.