శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 8 జులై 2016 (15:55 IST)

రోజూ తలస్నానం తప్పు.. మంగళ, గురువారాల్లో మహిళలూ.. అభ్యంగన స్నానం వద్దు.. శుక్ర, శని, ఆది ఓకే!

మహిళలు తరచుగా తలస్నానం చేస్తుంటారు. ఇంట్లో ఉండే స్త్రీలు పండుగలని, విశేషాలని, పూజలని ఇలా అన్నిసందర్భాలలో స్నానం చేస్తుంటారు. ఉద్యోగం చేసే మహిళలు బయట దుమ్ము, ధూళి పడుతుందని రోజూ తనస్నానం చేస్తారు. నిజ

మహిళలు తరచుగా తలస్నానం చేస్తుంటారు. ఇంట్లో ఉండే స్త్రీలు పండుగలని, విశేషాలని, పూజలని ఇలా అన్నిసందర్భాలలో స్నానం చేస్తుంటారు.  ఉద్యోగం చేసే మహిళలు బయట దుమ్ము, ధూళి పడుతుందని రోజూ తనస్నానం చేస్తారు. నిజానికి రోజూ తలస్నానం చేయడం శాస్త్ర ప్రకారం తప్పు అని పండితులు సూచిస్తున్నారు. ఒక్క మహిళలకే కాదు.. ప్రతి ఒక్కరికి కొన్ని రోజులు తలస్నానం నిషిద్ధం వారంటున్నారు. 
 
అశుభంగా భావించే మంగళవారంలో ఎట్టి పరిస్థితుల్లోను తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. సోమవారం చేస్తే తాపాన్ని ఇస్తుంది కాబట్టి చేయకపోవడమే మంచిది. బుధవారంనాడు తలస్నానం చేస్తే ఎటువంటి నష్టం లేదు కాబట్టి చేయవచ్చు. గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేయడంతో వారికి కీడు జరుగుతుందట. కాని శని, ఆదివారాల్లో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి దోషం లేదు. 
 
ముఖ్యంగా స్త్రీలు ప్రతి శుక్రవారం విధిగా తలస్నానం చేయాలి. శుక్రవారం నాడు కచ్చితంగా పసుపును మంగళసూత్రానికి రాసుకోవాలి. ముఖానికి కూడా పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుంది. అయితే పురుషులకి మాత్రం శుక్రవారం నాడు తలస్నానం చేయడం నిషిద్ధం. శనివారం, ఆదివారం, బుధవారం మాత్రమే తలస్నానం చేయాలి.
 
పండుగ దినాల్లో ఏవారం ఏది వచ్చినా విధిగా తలస్నానం చేయాల్సిందే. అది తప్పు కాదు.. సఏది ఏమైనా  స్త్రీలు మాత్రం శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ధూపదీప నైవేద్యాలతో ఇష్టదేవతను పూజిస్తే.. ఆ ఇళ్లు సిరిసంపదలతో తులతూగుతుందని పండితులు చెప్తున్నారు.