బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:44 IST)

తెలుగు రాష్ట్రాలకు పెళ్లికళ వచ్చేసింది.. జూలై 7వరకు మండపాల డిమాండ్

మూఢాలు తొలగిపోయాయి. పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది. వరుసగా మూడు నెలల తర్వాత తిరిగి తెలుగు రాష్ట్రాలకు పెళ్లికళ వచ్చేసింది. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో మంచి ముహూర్తాలుండటంతో.. కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగ

మూఢాలు తొలగిపోయాయి. పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది. వరుసగా మూడు నెలల తర్వాత తిరిగి తెలుగు రాష్ట్రాలకు పెళ్లికళ వచ్చేసింది. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో మంచి ముహూర్తాలుండటంతో.. కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకుముందు దాదాపు మూడు నెలల పాటు కొనసాగిన మూఢాలు ముగియడంతో.. పెళ్లిళ్లు వేగంగా ఫిక్సైపోతున్నాయి. 
 
నవంబర్ నుంచి మూఢమి కావడంతో, కల్యాణ మండపాలు బోసిపోయారు. అయితే ప్రస్తుతం పెళ్లికల రావడంతో తొలి ముహూర్తం 19వ తేదీన వుండగా మార్చి 3,4 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెప్తున్నారు. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వివాహాలు జరుగనున్నాయి. ఈ శుభకార్యాల సీజన్ జూలై 7 వరకు వుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగిపోతోంది.