శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (19:02 IST)

ముత్యపు పందిరి వాహనంపై పద్మావతీ అమ్మవారు

కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం తిరుచానూరు పద్మావతీ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు తరించిపోయారు. శోభాయమానంగా ఖరీదైన ముత్యాలతో అలంకరించిన ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
 
ముత్యపుపందిరిని కనుల పండవలా తయారుచేశారు. అదేసమయంలో అమ్మవారిని కూడా వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలను అలంకరణతో తేజోవంతంగా కనిపించారు. కాలేయ మర్దనం చేస్తున్న క్రిష్ణస్వామి అమ్మవారితో పాటు ముత్యపుపందిరి వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. 
 
ఈ వాహనం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ తిరుమాడ వీధులలో ఊరేగింది. ఈ కార్యక్రమంలో జియర్ స్వామి, టీటీడీ తిరుపతి ఈవో ఎంజి గోపాల్, జేఈవో పోలా భాస్కర్, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారిణి చెంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.