శ్రీవారి ఆలయం ఎదుట పందుల సంచారం

ఆదివారం, 3 డిశెంబరు 2017 (10:43 IST)

pigs

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో వరాహాల మంది తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి తమ ఇష్టానుసారం పరుగులు పెడుతుంటే, టీటీడీ అధికారులు గమనించకపోవడం భక్తులు విస్తుపోయేలా చేసింది. ఏడు పందుల మంద ఒకటి బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి మెట్లు దిగి కిందకు వచ్చి, ఆయన మందు వరకూ వెళ్లి, అక్కడి నుంచి దక్షిణ మాడవీధిలోకి పరుగులు పెట్టాయి. 
 
అత్యంత పవిత్రంగా భావించే తిరుమాడ వీధుల్లో ఇవి తిరగడం భక్తులందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా భక్తులను ఇక్కడ చెప్పులతో తిరగనివ్వరు. అలాంటి చోట పందులు తిరగడంపై అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. టీటీడీ నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. బేడీ ఆంజయనేయ స్వామి ఆలయం ముందు నుంచి దక్షిణ మాడ వీధుల్లోకి వచ్చినట్టు చెబుతున్నారు భక్తులు. తిరుమలలో పందులను నియంత్రించాలని గతంలో ఈఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. దీనిపై మరింత చదవండి :  
Pigs Tirumala Temple Lord Venkateswara Temple

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఆధార్ లింక్‌తో శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్‌ : ఈవో అనిల్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి ఇకపై టైమ్‌స్లాట్ విధానాన్ని అమలు ...

news

గీత పుట్టింది ఈ రోజే.. అర్జునునికి శ్రీకృష్ణుడి ఉపదేశం.. సూక్తులు

అర్జునునికి నాడు గీతోపదేశం చేసింది.. ఈ రోజే. మనిషి తత్వాన్ని విశ్లేషించిన గీత పుట్టిన ...

news

#GitaJayanti : పరమాత్మతత్వాన్ని బోధించిన రోజు

నేడు (నవంబరు 30వ తేదీ) గీతాజయంతి. భగవద్గీత మానవాళికి అందిన రోజు. సాక్షాత్ శ్రీకృష్ణుడే ...

news

రుద్రాక్షలు ధరించి నిద్రించడం.. శృంగారంలో పాల్గొనడం కూడదు

రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. ...