Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడు సిఎంకు తిరుమలలో అవమానం... బాబుకు చెపుతాం...

బుధవారం, 4 అక్టోబరు 2017 (17:56 IST)

Widgets Magazine
Palanisamy

తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామికి తిరుమలలో తీవ్ర అవమానం జరిగింది. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమలకు వచ్చిన పళణిస్వామిని టిటిడి ఘోరంగా అవమానించింది. ఎమ్మెల్యేకు ఇచ్చే మర్యాదలను మాత్రమే సిఎంకు చేసింది. తమిళనాడు సిఎం అంటే అంత అగౌరవమా అంటూ అన్నాడిఎంకే నేతలు టిటిడి తీరుపై మండిపడుతున్నారు.
 
నిన్న కుటుంబ సమేతంగా ఉదయం పళణిస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు. సిఎంకు టిటిడి ఈఓ గాని, లేకుంటే జెఈఓలు గాని తీర్థప్రసాదాలు ఇవ్వాలి. అలాంటిది ఆలయ డిప్యూటీ ఈఓ ప్రసాదాలు ఇచ్చారు. అంతేకాదు ప్రోటోకాల్ ప్రకారం సిఎంకు టిటిడి ముద్రించిన క్యాలెండర్, డైరీ, స్వామివారి ఫోటో ఇవ్వాలి. అలాంటిది ఒకే ఒక్క ఫోటో ఇచ్చి అగౌరవపరిచింది. పళణిస్వామి ఆలయంలో ఉండగానే భక్తులను దర్శనానికి అనుమతించేశారు. సిఎం వెంట టిటిడి ఉన్నతాధికారులెవరూ లేరు. 
 
తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిఎంను టిటిడి ఉన్నతాధికారులు చాలా చిన్నచూపు చూశారని తమిళనాడుకు చెందిన అన్నాడిఎంకే నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అన్నాడిఎంకే నేతలు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గుర్మీత్ నాకు తండ్రిలాంటివాడు.. చెడు సంబంధం అంటగట్టొద్దు : హనీప్రీత్

డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు తండ్రిలాంటివాడని, ఆయనతో తనకు చెడు సంబంధం ...

news

పది సూట్‌కేసుల్లో 23 గన్స్‌ను హోటల్‌కు చేరవేసిన పెడ్డాక్

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నరమేధానికి పాల్పడిన స్టీఫెన్ పెడ్డాక్‌ గురించి అనేక ...

news

పయ్యావుల కేశవ్‌కు కెసిఆర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదేనట...

పరిటాల శ్రీరామ్ వివాహం కంటే ఆ వివాహానికి వచ్చిన పయ్యావుల కేశవ్, కెసిఆర్‌లు కలవడం మాత్రం ...

news

'We're all in 2017 while she's in 3017' : వాకిలిని ఇలా శుభ్రం చేయొచ్చు (Video)

సాధారణంగా ఇంటి వాకిలిని మహిళలు నడుం వంచి చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే, పెద్ద పెద్ద ...

Widgets Magazine