మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (13:02 IST)

ఆంధ్ర మహాభారతం 108 పద్యగానమాలిక ఆడియోను ఆవిష్కరణ

vijayendra saraswathi swamy
పూజ్యశ్రీ జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య మహస్వామి డా.గజల్ శ్రీనివాస్ గానం చేసిన కవిత్రయం రచించిన శ్రీ అంధ్ర మహాభారతంలోని 108 పద్యాల ఆడియో సమర్పణ కార్యక్రమo ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు గ్రామంలో అనేక మంది భక్తుల సమక్షంలో జరిగింది. 
 
కవిత్రయం రచించిన అంధ్ర మహాభారతంలోని పద్యాలు బాల బాలికలు, యువతీ యువకులు పఠించడం ఎంతో అవసరమని, దీనివల్ల తెలుగు భాషా వైభవం, భక్తితత్వం, అత్యంత సుందరమైన భావవ్యక్తీకరణ వారికి అర్థమవుతాయని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఈ సందర్భంగా అన్నారు. 
 
శ్రీ కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి జన్మదిన సందర్భంగా 20 డిసెంబర్ 2022 రోజున కొవ్వూరు సంస్కృత విద్యా పీఠం వేదికగా వేలాదిమంది బాల బాలికలచే ఈ 108 పద్యాలను వివిధ ప్రాంతాల నుండి ఒకే సమయంలో సామూహికంగా గానం చేయించే ప్రయత్నం కంచి కామాక్షి పీఠం చేపట్టునున్నదని నిర్వాహకులు తెలిపారు. 
 
ఈ 108 పద్యాలను అందరూ సులువుగా పాడుకునే విధంగా గానం చేసి ధ్వని ముద్రితం చేసిన సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు, ప్రముఖ గాయకులు డా.గజల్ శ్రీనివాస్‌ను శ్రీ కంచి శంకర విజయేంద్ర స్వామి అభినందించి తీర్థ ప్రసాదాలను అందినట్టు గజల్ శ్రీనివాస్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.