శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: బుధవారం, 21 డిశెంబరు 2016 (23:05 IST)

తిరుమల వేంకటేశ్వరుడి డబ్బులైతే మాకేంటి? చెల్లవు తీస్కెళ్లండి...

సాక్షాత్తు తిరుమల వెంకన్నకు పాత నోట్ల కష్టాలు తప్పలేదు. ఇప్పటికే సామాన్య ప్రజలు పాత పెద్ద నోట్ల రద్దుతో విలవిలలాడిపోతుంటే స్వామివారి హుండీకి చేరిన డబ్బులను డిపాజిట్‌ చేసేందుకు తీసుకెళితే ఆ నోట్లను తిరిగి పంపేశారు. అది ఒకటి రెండు కాదు.. ఏకంగా కోటి రూప

సాక్షాత్తు తిరుమల వెంకన్నకు పాత నోట్ల కష్టాలు తప్పలేదు. ఇప్పటికే సామాన్య ప్రజలు పాత పెద్ద నోట్ల రద్దుతో విలవిలలాడిపోతుంటే స్వామివారి హుండీకి చేరిన డబ్బులను డిపాజిట్‌ చేసేందుకు తీసుకెళితే ఆ నోట్లను తిరిగి పంపేశారు. అది ఒకటి రెండు కాదు.. ఏకంగా కోటి రూపాయలు. దీంతో కోటి రూపాయలను తిరిగి తితిదే పరకామణికి తీసుకొచ్చేశారు.
 
మంగళవారం తిరుమల శ్రీవారికి 2.47 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. అందులో కోటి రూపాయలు పాత 500, 1000 నోట్లే. దీంతో నిన్న సాయంత్రం తిరుపతిలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంకులలో డిపాజిట్‌ చేసుందుకు డబ్బులను టిటిటి అధికారులు తీసుకెళ్ళారు. అయితే కొత్త నోట్లు, వంద, 50, 20, 10 రూపాయలు, చిల్లరను మాత్రమే స్వీకరించిన బ్యాంకు సిబ్బంది పాత పెద్దనోట్లను స్వీకరించేది లేదని తేల్చేశారు.
 
ఎంత వాదించినా బ్యాంకు సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో చేసేదిలేక తితిదే ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇచ్చిన సిబ్బంది ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి తిరుపతిలోని పరకామణిలో పెట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ డబ్బును ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో టిటిడి అధికారులు ఉన్నారు. అంతేకాదు ఇక మీదట వచ్చే డబ్బులను ఏం చేయాలో అర్థంకాని తికమకపడుతున్నారు తితిదే అధికారులు.