ముఖ్యమంత్రి చంద్రబాబుకి శ్రీవారి భక్తులు మొర.. ఎందుకు?

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (21:17 IST)

Laddu

ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు శ్రీనివాసుని భక్తులు మెయిల్స్ పంపుతున్నారట. ఆ మెయిల్స్‌లో టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయమంటూ సమాచారాన్ని పంపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో వ్యయప్రయాసలుకోర్చి ఎలాగోలా దర్శించుకుని ప్రసాదాలను తీసుకెళదామనుకుంటే ఆ ప్రసాదం రేట్లను ఇంత భారీ స్థాయిలో పెంచడమా అంటూ శ్రీవారి భక్తులు మెయిల్స్ ద్వారా పంపారు. అంతటితో ఆగలేదు... టిటిడి ఉన్నతాధికారులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.. వారిపై నియంత్రణ ఖచ్చితంగా ఉండాలంటూ మెయిల్స్ ద్వారా కోరారు.
 
మెయిల్స్ పంపింది ఒకరిద్దరు కాదు.. ఏకంగా 5 లక్షల మంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెయిల్స్‌కు ఈ స్థాయిలో మెయిల్స్ రావడం ఇదే ప్రథమమంటున్నారు సిఎం పేషీ అధికారులు. మెయిల్స్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నామని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి చిన్న లడ్డూను 25 రూపాయలకు బదులు 50 రూపాయలు, పెద్ద లడ్డూను 100కు బదులు రెండు వందల రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. ఇలా రేట్లను పెంచుకుంటే పోతే తమ పరిస్థితి ఏంటని సామాన్యభక్తులు మెయిల్స్ ద్వారా సమాచారం పంపారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

చిన్న లడ్డూ ధర రూ.50.. పెద్ద లడ్డూ ధర రూ.200

శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ...

news

సైతాను మనల్ని మార్చడానికి ఎప్పుడు మన వెంటే ఉంటుంది

మనుష్యజాతి నిర్మించడానికి దేవుడు అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. ...

news

అందరి కోర్కెలు తీర్చే దత్తాత్రేయుడు, శ్రీ షిరిడీ సాయి

దత్తాత్రేయుడు అనే పేరులో తత్వపరమైన రహస్యార్థం ఉంది. సమస్త ప్రాణకోటికి ప్రాణరూపంగా తనకు ...

news

శ్రీవారి సర్వదర్శనం : టైమ్ స్లాట్ సూపర్ సక్సెస్

ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)బోర్డు ప్రయోగాత్మకంగా చేపట్టిన ...