ఆస్తులు అమ్మడం కొత్తేమీ కాదు : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డుకు నిరర్ధక ఆస్తులను విక్రయించడం కొత్తేమీ కాదనీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తితిదే భూముల వేలానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుండటం, గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
దీనిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, టీటీడీ భూముల వేలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి కూడా ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. గత బోర్డు నిర్ణయాలపై మాత్రమే సమీక్షించామన్నారు.
బోర్డు ఆస్తులు అమ్మడం ఇదేమీ కొత్త కాదని, 1974 నుంచి భూములను అమ్మినట్లు చెప్పారు. ఆస్తుల విక్రయానికి సంబంధించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకొంటామన్నారు. అదేసమయంలో అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల్ని అమ్మడం టీటీడీకి కొత్తకాదని అన్నారు.
టీటీడీ భూములను వేలం వేయాలని గత బోర్డు సభ్యులే నిర్ణయించారన్నారు. 2016 జనవరి 30వ తేదీనే 50 ఆస్తుల వేలంపై టీడీపీ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. భూముల వేలంపై రెండు బృందాలను ఏర్పాటుచేశామని, భూముల పరిరక్షణకు మాత్రమే మేం నిర్ణయాలు తీసుకొంటున్నామన్నారు.