మంగళవారం, 28 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (17:01 IST)

ఆ ఉద్యోగుల వేతనాలు పెంపు : తితిదే పాలక మండలి నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో పాలకమండలి సమావేశమైంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
* తితిదేలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని నిర్ణయించారు. 
* చిత్తూరు జిల్లా నారాయణ వనంలో రూ.2.5 కోట్లతో అవణాక్షమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. 
* తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చుట్టూ రూ.3.77 కోట్లతో గ్రిల్స్ ఏర్పాటు. 
* రూ.21.7 కోట్ల వ్యయంతో అధునాత బూందిపోటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 
* రూ.28 లక్షలతో గంగమ్మ గుడి ఆలయం వద్ద ఆర్చిని నిర్మించనున్నారు. 
* ఆవిలాల చెరువు అభివృద్ధికి రూ.42.7 కోట్లు కేటాయిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
* ముఖ్యంగా రూ.4.19 కోట్ల వ్యయంతో ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది.