రాజకీయ నేతల కంబధ హస్తాల్లో శ్రీవారి ఆలయం : రమణ దీక్షితులు

బుధవారం, 16 మే 2018 (15:19 IST)

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఓ వ్యాపారంగా మార్చుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నై పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Ramana Deekshitulu
 
1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వాన్ని ప్రభుత్వం ఉన్నపళంగా రద్దు చేసిందని, అందుకు గల కారణాలు తెలియవన్నారు. వంశపారంపర్య అర్ఛకత్వాన్ని రద్దు చేసిన ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అదేసమయంలో అధికారులు కూడా స్వామి వారి కైంకర్యాల్లో తలదూర్చుతున్నారని, ఈ విషయమై అర్చకులను బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే స్వామి వారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రమణ దీక్షితులు, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిణ ఆభరణాలు ఎక్కడున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజకీయ నాయకుల కబంధహస్తాల నుంచి శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. దీనిపై మరింత చదవండి :  
తిరుమల శ్రీవారి ఆలయం రమణ దీక్షితులు Controversial Ttd Ramana Deekshitulu Chief Priest Press Meet

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అలాంటి వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా వున్నా పోరాడగలడు...

సత్యం, పవిత్రత, నిస్వార్ధత- ఈ మూడూ ఎక్కడ ఉంటాయో.. అక్కడ సూర్యునికి పైన గాని క్రింద గాని ...

news

అపజయాలు లేని జీవితం ఒక జీవితమేనా?

నేను జీవితంలో అనేక తప్పులను చేశాను. కాని ఆ తప్పులలో ఏది లేకున్నా, నేను ఈ స్థితికి ...

news

పాశుర ప్రభావం గురించి? ఎందుకు?

జీవితంలో స్తబ్దత నెలకొన్నపుడు తన గత వైభావాన్నీ, గడచిన మంచి రోజులనూ, భగవంతుని దయవలన ...

news

అసలు సాధన, ఆధ్యాత్మికతలే వాస్తవం కాదనే దృష్టికొస్తారు

మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాము. ఆ కష్టం తొలగినపుడు భగవంతుడిని ...