ఆధార్ లింక్‌తో శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్‌ : ఈవో అనిల్

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:35 IST)

Lord Venkateswara

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి ఇకపై టైమ్‌స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ నంబర్ అనుసంధానంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి త్వరలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.
 
శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించారు. 23 మంది భక్తులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెల రెండో వారం నుంచి సర్వదర్శనంలో టైమ్‌స్లాట్‌ విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. దాన్ని కొద్దిరోజులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. 
 
ఈ విధానం అమలులో ఎదురయ్యే లోటుపాట్లను సరిచేసి ఆధార్‌ అనుసంధానంతో పూర్తిస్థాయి టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఆధార్‌ లేనివారికి ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ద్వారానే దర్శనం కల్పిస్తామన్నారు. ఇకపోతే, ఈ నెల 29న ఏకాదశి, 30న ద్వాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

గీత పుట్టింది ఈ రోజే.. అర్జునునికి శ్రీకృష్ణుడి ఉపదేశం.. సూక్తులు

అర్జునునికి నాడు గీతోపదేశం చేసింది.. ఈ రోజే. మనిషి తత్వాన్ని విశ్లేషించిన గీత పుట్టిన ...

news

#GitaJayanti : పరమాత్మతత్వాన్ని బోధించిన రోజు

నేడు (నవంబరు 30వ తేదీ) గీతాజయంతి. భగవద్గీత మానవాళికి అందిన రోజు. సాక్షాత్ శ్రీకృష్ణుడే ...

news

రుద్రాక్షలు ధరించి నిద్రించడం.. శృంగారంలో పాల్గొనడం కూడదు

రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. ...

news

వైకుంఠ ఏకాదశికి తిరుమల రావద్దండి... వస్తే మీ ఇష్టం...

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ...