Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోవిందా.. గోవిందా : సర్వదర్శనానికి ఆధార్‌

గురువారం, 23 నవంబరు 2017 (09:08 IST)

Widgets Magazine
Lord Venkateswara

ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గుర్తింపుకోసం అన్నిటా ఆధార్‌ను తప్పని సరిచేసింది ప్రభుత్వం. ఇప్పుడు శ్రీవారి దర్శించుకునేందుకు కూడా ఆధార్ తప్పదంటోంది టీటీడీ. ఈ విధానం వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. 
 
సర్వదర్శనానికీ స్లాట్‌ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు తితిదే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇందుకోసం తిరుమలలో 21 ప్రాంతాలలో 150 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేపట్టారు. టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తితిదే అధికారులు తప్పనిసరి చేశారు. ఒక్కసారి టోకెన్ పొందిన భక్తుడికి మరో 48 గంటల వరకు టోకెన్ పొందే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అప్పులు తీరిపోవాలంటే.. మంగళవారం పూట ఇలా చేయండి..

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం ...

news

అయ్యప్ప స్వామి అష్టకంలో మార్పు..

కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులు స్వామి దర్శనార్థం కేరళకు వెళ్తుంటారు. పవిత్ర మాలలు ...

news

రుద్రాక్షలను రాత్రిపూట ధరించవచ్చా? (video)

రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి. వాటిని ధరించడం ద్వారా సాత్త్విక గుణాన్ని పొందవచ్చు. తపస్సు ...

news

దారిద్ర్య దహన శివస్తోత్రం

కార్తీక మాసంలో శివునిని ఈ స్తోత్రము ద్వారా స్తుతించినట్లైతే దారిద్ర్యాలు తొలగిపోతాయి. ...

Widgets Magazine