Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాస్ టేలర్‌ హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడు.. ఆధార్ ఇవ్వండి.. సెహ్వాగ్

మంగళవారం, 7 నవంబరు 2017 (09:33 IST)

Widgets Magazine
sehwag

ట్విట్టర్‌లో సెటైర్లు విసురుతూ.. ఆకట్టుకునే ట్వీట్లు చేసే టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా న్యూజిలాండ్‌ స్టార్ క్రికెటర్ రాస్‌ టేలర్‌‌పై పడ్డాడు. రాస్ టేలర్‌కు ఆధార్‌ కార్డు ఇవ్వాలంటూ సెహ్వాగ్ చేసిన ట్వీటుకు ఆధార్ జారీ సంస్థ స్పందించింది.

వివరాల్లోకి వెళ్తే.. కివీస్‌తో తొలి వన్డే అనంతరం ట్విట్టర్‌లో సెహ్వాగ్ స్పందించాడు. దర్జీ (టేలర్‌) గారు బాగా ఆడారు. దీపావళి గిరాకీలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. మంచి ప్రదర్శన చేశారంటూ ట్వీట్ చేశాడు. అందుకు ప్రతిగా టేలర్ కూడా స్పందించాడు. ఈసారి మీ ఆర్డర్‌‌ను ముందే పంపండి. దీపావళి కంటే ముందే మీ బట్టలు కుట్టి ఇచ్చేస్తానంటూ బదులిచ్చాడు.
 
రెండో ట్వంటీ-20లో టేలర్ విఫలం కావడంతో మరో ట్వీట్ చేసిన సెహ్వాగ్ టైలర్ దుకాణం బంద్ అయ్యిందని.. తిరువనంతపురంలో కలుద్దామంటూ ట్వీట్ చేశాడు. మూతపడ్డ ఓ టైలర్‌ దుకాణం ముందు కూర్చున్న ఫొటోను కూడా పోస్టు చేశాడు. అంతే కాకుండా టేలర్‌ హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడని తెలిపాడు. టేలర్‌ హిందీ ప్రావీణ్యానికి ముగ్ధుడినయ్యానని తెలిపిన వీరూ, అతడికి ఆధార్‌ కార్డు ఇవ్వాలని‌ అభిప్రాయపడ్డాడు. దీనిపై ఆధార్‌ కార్డు జారీ చేసే ప్రభుత్వ సంస్థ యుఐడిఏఐ స్పందిస్తూ, ఇక్కడ భాష ముఖ్యం కాదని ఎక్కడ నివసిస్తారనేదే ముఖ్యమని పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

#HappyBirthdayVirat : ఫార్మెట్ ఏదైనా విజయం కోహ్లీసేనదే...

భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లీ శకం నడుస్తోంది. ఆటలో దూకుడు.. మాటలో ముక్కుసూటితనం… ...

news

రెండో టీ20 కివీస్‌దే... ఉత్కంఠగా మారనున్న మూడో టీ20

రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. పర్యాటక జట్టు కివీస్ ...

news

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏంటది?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ...

news

నేడే కీలకమైన రెండో టీ20... సిరీస్ లక్ష్యంగా భారత్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అత్యంత కీలకమైన రెండో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. సిరీస్ ...

Widgets Magazine