Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీమా పాలసీలకు కూడా ఆధార్ లింకు చేయాల్సిందే...

గురువారం, 9 నవంబరు 2017 (11:44 IST)

Widgets Magazine
life insurence policy

బీమా పాలసీలకు కూడా ఆధార్ నంబరు లింకు చేయాల్సిందేనంటూ భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టంచేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, రెండో సవరణ-2017 ప్రకారం సాధారణ, జీవిత బీమా పాలసీలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. 
 
ప్రస్తుతం కొత్త పాలసీలకు ఆధార్‌ను అనుసంధానించాల్సి ఉంటుందని, ఆర్థిక సేవలన్నింటికీ పాన్‌/ఫామ్‌ 16తో పాటు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ, గత జూన్‌లో ప్రభుత్వం మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని సవరించింది. ఈ చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తదుపరి ఆదేశాల కోసం వేచి చూడాల్సిన అవసరంలేదని సాధారణ, జీవిత బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ తెలిపింది. 
 
తాజా ఆదేశాల వల్ల స్వల్పకాలం పాటు ఇబ్బందులు తలెత్తినా, దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుందని, మోసాల నివారణ, 'మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధన'ల ఏకీకరణకు ఇది ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి భార్గవ్‌ దాస్‌ గుప్తా తెలిపారు. ఐఆర్డీఏఐ ఆదేశాలు దేశంలో 24 జీవితబీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు (ఆరోగ్యబీమా సంస్థలు సహా) ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పెద్దనోట్ల రద్దుతో ఒరిగిందేమిటి? విదేశాల్లో మూలుగుతున్న 90శాతం నల్లధనం.. (వీడియో)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు అమలు చేసి నేటికి (నవంబర్ 8వ తేదీ) ...

news

నోట్ల రద్దు : రియల్ ఎస్టేట్ కుదేలు.. చితికిపోయిన చిన్నవ్యాపారులు

దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేసిన నేటికి సరిగ్గా యేడాది. రూ.500, రూ.1000 ...

news

86 శాతం కరెన్సీ నోట్ల రద్దు దరిద్రమైన నిర్ణయం : మన్మోహన్ సింగ్

సరిగ్గా యేడాది క్రితం అంటే 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ...

news

భీమ్ యూపీఐని ప్రారంభించిన పేటీఎం... దేశపు అతిపెద్ద యూపీఐ ఐడీ జారీదారుగా...

భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల వేదిక పేటీఎం తన వేదికపై భీమ్ యూపీఐని ఉపయోగిస్తూ ...

Widgets Magazine