మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (22:45 IST)

తితిదే గోశాలలో గోపూజ.. చిన్ని క్రిష్ణుడు చిద్విలాసం

గోకులాష్టమి సంధర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ గోశాలలో బుధవారం గోపూజలు నిర్వహించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తొలుత శ్రీక్రిష్ణస్వామి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
 
ఆ తరువాత అర్చకుల ఈఓ సింఘాల్‌కు వరిపట్టం కట్టి సాంప్రదాయబద్ధంగా గోపూజా మందిరానికి తీసుకెళ్ళారు. అలంకరించిన గోవుకు ఈఓ పూలమాలలు వేసి పసుపు, కుంకుమతో అలంకరించి అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య గోపూజ నిర్వహించారు. 
 
ఆ తరువాత గోవులకు దాణా పెట్టారు. కోవిడ్ -19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అభిషేకం, అర్చనలు జరిగాయి. తిరుమలలో కూడా శ్రీక్రిష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. 
 
గోగర్భం డ్యాం చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్థనుడు అయిన శ్రీక్రిష్ణునికి ఉదయం 10గంటల నుంచి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది.