శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (16:21 IST)

11వ శతాబ్దంలోనే ఒంటిమిట్ట ఆలయ నిర్మాణం.. భద్రాద్రి కంటే...

ఖమ్మం జిల్లాలో గోదావరీ ఒడ్డున రామదాసు ఆలయాన్ని నిర్మించేందుకు వందల సంవత్సరాలకు ముందే కడప జిల్లాలో ఒంటిమిట్ట రామాలయం పూజలందుకుంటోంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు అధికారిక శ్రీరామనవమి వేడుకల్ని ఒంటిమిట్టలోనే నిర్వహించాలని నిర్ణయించుకుందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. 
 
శ్రీరామనవమి రోజున స్వామివారికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్టు ఆధారాలున్నాయని మాణిక్యాలరావు తెలిపారు. కొత్త రాజధాని ప్రాంతంలో దేవాదాయశాఖ భూములను త్వరలోనే ప్రభుత్వానికి అప్పగిస్తామని, రైతులు తీసుకున్నట్టుగానే పరిహారం తీసుకుంటామని వివరించారు.