మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?

lovers
Last Modified గురువారం, 19 సెప్టెంబరు 2019 (16:05 IST)
ప్రేమ అనే పదం విన్నప్పుడు లోకంలోని ఎవరిలో ఎలాంటి భావం ఉదయించినా ప్రేమ అనే బంధంతో దగ్గరైనవారు మాత్రం ఆ పదం విన్న ప్రతిసారీ తమ ప్రేమ భాగస్వామిని గురించి మాత్రమే తల్చుకుని ఆనందంతో ఒక్కసారిగా పొంగిపోతారు. ఎందుకంటే ఇతర బంధాల ద్వారా దగ్గరైనవారికంటే ప్రేమబంధం ద్వారా మనసులు ముడిపడినవారి మధ్య ఏర్పడిన బంధం చాలా బలంగా ఉంటుంది కాబట్టి. అయితే ఇదే విషయానికి సంబంధించే సమాజంలో సైతం ప్రధానంగా విమర్శలు వినిపిస్తుండడం తెలిసిందే.

ఆకర్షణ కారణంగా ఏర్పడిన ప్రేమబంధం ఆ ఆకర్షణ కాస్తా తగ్గిపోగానే బంధం సైతం క్రమంగా బలహీనమవుతుందని అందుకే ప్రేమ విషయంలో ప్రేమికుల మధ్య ఉన్న బంధం ప్రారంభంలో ఉన్నంత బలంగా ఆ తర్వాతి రోజుల్లో ఉండదని చాలామంది భావిస్తుంటారు. అయితే వీరి వ్యాఖ్యల్లో కొంతవరకు నిజం ఉన్నా కేవలం ఆకర్షణ ప్రాతిపదికన కాకుండా అర్థం చేసుకుని, జీవితాంతం కలిసి ఉండాలనే కృతనిశ్చయంతో ప్రేమబంధం ఏర్పడిన జంటల మధ్య మాత్రం ఆ బంధం ఏనాటికీ బలహీనం కాబోదు. పైపెచ్చు కాలం గడిచేకొద్దీ అది క్రమంగా బలపడుతుంది కూడా.

పైన చెప్పుకున్న రెండు విషయాలు ఎలా ఉన్నా ప్రేమలో కొనసాగుతున్నవారు కొన్నిరోజులు గడిచాక తమ ప్రేమ ఇంకా స్వచ్చంగానే ఉందా... తమ ప్రేమలో ఎలాంటి అరమరికలు ఏర్పడలేదు కదా... ప్రేమించిన తొలిరోజుల్లో ప్రేమ భాగస్వామిపై ఉన్న ప్రేమభావం నేటికీ కొనసాగుతోందా... తమ ప్రేమ జీవితాంతం ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందా... అని ఒక్కసారి అలోచించినప్పుడు అన్నింటికీ సంతృప్తికరమైన సమాధానాలు రాగలిగితే వారి ప్రేమకు ఇకముందు ఏమాత్రం అడ్డంకులు రావనే చెప్పవచ్చు.
దీనిపై మరింత చదవండి :