Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంక్రాంతి రోజున దానం చేయాల్సిందే.. శివునికి అభిషేకం చేస్తే?

బుధవారం, 10 జనవరి 2018 (15:40 IST)

Widgets Magazine
sankranthi

సంక్రాంతికి రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది. సంక్రాంతి రోజున ఉపవాసం వుండి... పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి. కొందరు నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేయాలి. రవి సంక్రమణం రోజున స్నానం చేయని నరుడు ఏడు జన్మలదాకా రోగి అవుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
అదే రోజున నిష్టతో, శుచిగా మహాదేవుని, సూర్యదేవుడిని పూజించే వారికి శనీశ్వర దోషాలు తొలగిపోతాయి. రవి సంక్రమణం అయ్యే సంక్రాంతి రోజున నువ్వుల పిండితో స్నానం.. నువ్వులతో చేసిన పిండివంటలు తీసుకోవడం ద్వారా శనీశ్వరుని నుంచి ఏర్పడే ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
అందుకే సంక్రాంతి రోజున నువ్వుల నూనె రాసుకుని.. నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయాలి. సంక్రాతి రోజున ఫలాలు, ధాన్యం, వస్త్రాలు, గుమ్మడి, కూరగాయలు, దుంపలు, చెరకు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దేవరుణం, పితృరుణం, మానవ రుణం, రుషి రుణం, భూతరుణం నుంచి విముక్తి పొందే మార్గాలను సంక్రాంతి నిర్దేశిస్తుంది. 
 
ఇంద్ర, వరుణ, వాయు దేవతల సాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించడం ద్వారా మకర సంక్రాంతి రోజున పంటలు సమృద్ధిగా పండుతాయి. తద్వారా మనిషి జీవన పోషణ జరుగుతుంది. అందుకే శుచిగా స్నానమాచరించి సూర్యాది దేవతలను పూజించి, కొత్త బియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించడం చేస్తారు. 
 
అలాగే పితృదేవతలను, పంచభూతాలను కూడా సంక్రాంతి రోజున పూజించాలి. నీరు, భూమి, గాలి, ఆకాశం, అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి. ఇక మనకు సహకరించే తోటి మనుషులకు కూడా చెరుకు, ఫలాలు, వస్త్రాలు దానంగా ఇవ్వాలి. సంక్రాంతి రోజున ఋషి రుణం తీర్చుకోవాలంటే, సత్‌గ్రంథపఠనాలు చేయాలని పండితులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

''భోగి'' రోజున రేగిపళ్ళు పిల్లల నెత్తిపై ఎందుకు పోస్తారు?

సంక్రాంతి నాలుగు రోజుల పండుగ. ఈ పండుగ మొదటి రోజును ''భోగి'', అని రెండో రోజును ...

news

సంక్రాంతికి నోరూరించే పనీర్ రసమలాయ్ ఎలా చేయాలి

పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. ...

news

సంక్రాంతి స్పెషల్ : నేతి అప్పాలు

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. సంక్రాంతికి చక్కెర పొంగలి, పాయసం, గారెలు వంటి పదార్థాలు ...

news

కలశం ఏర్పాటు ఎందుకు? సృష్టికి ముందు ఏం జరిగింది?

ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే.. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. ...

Widgets Magazine