బియ్యపు పిండితో ముగ్గు వేయాలి, ఎందుకంటే?
హిందువుల లోగిళ్లలోనూ ప్రాంగణాలోలనూ అలికి ముగ్గులు పెట్టడం ఎప్పుడూ వున్నదే. సంక్రాంతికి గొబ్బెమ్మలు, పూలు.. ఇలా రమణీయంగా వుంటాయి ఇళ్లు ముంగిళ్లు. ఇలా ముగ్గులు వేయడానికి కారణం వుంది.
మన భూమికి వున్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం వుంది. దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీనులు చెప్పారు. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి దిక్కు భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు ఎప్పుడూ తిరుగుతూనే వుంటాయి.
అవి ఇంట్లోకి ప్రవేశించకుండా వాకిలి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయాలి. ఇంట్లోకి వద్దామని వచ్చిన పిశాచం బియ్యపు పిండి తింటూ ఆ ముగ్గులోనే వుండిపోతుంది.