Widgets Magazine

‘ముక్కనుమ’ నాడు సావిత్రి గౌరీదేవి వ్రతం చేస్తే...?

శనివారం, 14 జనవరి 2017 (20:03 IST)

gauri

కనుమ మరుసటి రోజుని 'ముక్కనుమ'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు. సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. 
 
ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు, తాంబూలం వాయనంగా ఇస్తారు. 
 
ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

పశువుల ప్రాధాన్యత పండుగ ‘కనుమ’... ఈరోజున ఏం తినాలో తెలుసా?

కనుమ పండుగ రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులు నట్టింట ...

news

శ్రీవారి అభయహస్తాలు ఏం చెబుతాయో తెలుసా...!

దివ్యమంగళకరం శ్రీ వేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే ...

news

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి.. ఏ ముగ్గును ఎక్కడ.. ఎక్కడ వేయాలి?

ఇంటి గడప, గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను ...

news

సంక్రాంతి పుణ్యకాలం అంటే..!

ప్రాచీనకాలంలో శాస్త్ర అవగాహనా అంతగా లేని కారణంగా సూర్యగ్రహాన్ని దేవునిగా భావించేవారు. ...

Widgets Magazine