శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (18:41 IST)

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్.. 431 పాయింట్లు అప్

BSE
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం (డిసెంబర్ 5) ట్రేడింగ్ సెషన్‌ను భారీగా ముగించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీ-50 పాయింట్లు పెరిగి 20,855  వద్ద ముగిసింది. 
 
అలాగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ) 431 పాయింట్లు లాభపడి 69,296.14 వద్దకు చేరుకుంది. బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ ఇతర రంగాల సూచీలను అధిగమించగా, మీడియా, రియల్టీ, ఐటీ స్టాక్స్ పడిపోయాయి.
 
ఇకపోతే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ సెజ్, పవర్ గ్రిడ్, ఎన్టీబీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఎల్‌టీఐ మిండ్రీ, హిందుస్థాన్ యూనిలీవర్, దివీస్ ల్యాబ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటోలు వెనుకబడ్డాయి.