శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (13:00 IST)

చిన్నదేశం.. ఆట ఘనం.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో క్రొయేషియా

అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగిన తర్వాత ఎవరి గుర్తింపు అవసరం ఉండదు.. ఈ నానుడిని నిజం చేస్తూ పసికూన క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చేరి సంచలనం సృష్టించింది. ఈ దేశం అతి చిన్నదే కావొ

అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగిన తర్వాత ఎవరి గుర్తింపు అవసరం ఉండదు.. ఈ నానుడిని నిజం చేస్తూ పసికూన క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చేరి సంచలనం సృష్టించింది. ఈ దేశం అతి చిన్నదే కావొచ్చు. కానీ, ఆట మాత్రం ఘనం. ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి ఆటలో రాణించాలంటే పెద్దదేశమై ఉండాలన్న భావనను చెరిపేసింది.
 
గత ప్రపంచకప్ విజేతలను పరిశీలిస్తే ఉరుగ్వే మినహా మిగిలిన అన్నిదేశాలు ఎక్కువ జనాభా కలిగినవే కావడం విశేషం. ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్ (2.05 కోట్లు), జర్మనీ(8.3 కోట్లు), ఇటలీ(6 కోట్లు), ఫ్రాన్స్ (6.7 కోట్లు), ఇంగ్లండ్ (5.3 కోట్లు), అర్జెంటీనా (4.3 కోట్లు) జనాభా కలిగి ఉన్నాయి. కాగా.. సెమీస్ చేరిన బెల్జియం, ఫైనల్ చేరిన క్రొయేషియా ఈ ట్రెండ్‌ను మార్చేశాయి. క్రొయేషియా దేశ జనాభా కేవలం 40 లక్షలు మాత్రమే. ఇందులో 1.2 లక్షల మంది ఫుట్‌బాల్ క్రీడాకారులే కావడం గమనార్హం. అలాంటి చిన్నదేశం ఫుట్‌బాల్ ఆట ఎంతో ఘనమని తమ చేతల ద్వారా నిరూపించింది. 
 
నిజానికి క్రొయేషియాలో క్రీడలకు ఆదరణ కలిగించడంలో ఉమ్మడి యుగొస్లేవియానే కారణం. యుగొస్లేవియా నుంచి విడిపోక ముందుగా క్రొయేషియా రీజియన్‌ల క్రీడలకు ఎక్కువ నిధులు ఖర్చు చేయడంలో అద్భుతమైన మౌలిక వసతులు సమకూరాయి. అంతేకాదు స్వతంత్ర దేశంగా క్రొయేషియా ఏర్పడిన అనంతరం ఆర్థికవనరులు లేకున్నా క్రీడలకు సముచిత ప్రాధాన్యం కల్పించడంతో ఆ దేశం నుంచి మెరికల్లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. 
 
క్రీడలలో పాల్గొనాలంటే అథ్లెట్లు అసాధారణ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తూ అత్యున్నత ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఫుట్‌బాల్‌కు ఎంత ఆదరణ ఉందంటే వారి దేశ జనాభా 40 లక్షలు కాగా.. అక్కడ రిజిస్టరైన ఫుట్‌బాల్ క్రీడాకారులు 1.2 లక్షలు. ఇది ఆ దేశ జనాభాలో 3 శాతం కాగా.. బ్రెజిల్‌లో రిజిస్టరైన ఫుట్‌బాల్ క్రీడాకారులు 1 శాతం లోపే. అందుకే క్రొయేషియా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలన విజయాలు సాధించి ఫైనల్ చేరింది. 
 
అంతేకాదు.. క్రొయేషియాలో స్థిరపడిన ఇతరదేశాల ఆటగాళ్ల ఆటతీరుతోనే ఆ జట్టు రష్యా బెర్త్ సాధించడమే కాదు.. ఏకంగా ఫైనల్ చేరి అందరినీ విస్మయపరిచింది. స్థానికంగా ఆడే ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే జట్టులో చోటు చేసుకోగా.. ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడిన ఆటగాళ్లతో జట్టు పూర్తిస్థాయిలో బలోపేతంగా తయారైంది. వీరి చలవతోనే క్రొయేసియాకు రష్యా బెర్త్ దక్కడమే కాదు ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది.