ఫిఫా వరల్డ్ కప్ : రష్యా నిష్క్రమణ.. క్రొయేషియా గెలుపు

సోమవారం, 9 జులై 2018 (11:19 IST)

ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆతిథ్య రష్యా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. విజయం కోసం మ్యాచ్ చివరివరకూ హోరాహోరీ పోరాటం చేసినా ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు. క్రొయేషియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 3-4 గోల్స్‌తో ఓటమిపాలైంది. ఫలితంగా రష్యా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
fifa world cup
 
నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌తో రెండు జట్లూ సమవుజ్జీలుగా నిలువగా.. అదనపు సమయంలోనూ చెరోగోల్ కొట్టి 2-2తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా రెండు జట్లూ విజయం కోసం కొదమసింహాల్లా తలపడ్డాయి. 
 
1998 అరంగేట్రంలోనే ఫిఫా ప్రపంచకప్ సెమీస్ చేరిన క్రొయేషియా అద్భుత పోరాటంతో రష్యాను నిలువరించేందుకు ప్రయత్నించింది. మరోవైపు పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా సొంత ప్రేక్షకుల మద్దతుతో రష్యా జట్టు.. క్రొయేషియాను వణికించింది.  దీనిపై మరింత చదవండి :  
వరల్డ్ కప్ ఫిఫా 2018 రష్యా క్రొయేషియా విజయం Croatia Dream Victory Russia World Cup 2018

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఫిఫా వరల్డ్ కప్ : 28 యేళ్ల తర్వాత సెమీఫైనల్స్‌కు ఇంగ్లండ్

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ సాకర్ పోటీల్లో భాగంగా, ఇంగ్లండ్ జట్టు 28 యేళ్ల తర్వాత ...

news

ఫిఫా వరల్డ్ కప్ : ఉరుగ్వే చిత్తు.. సెమీస్‌లో ఫ్రాన్స్

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ సాకర్ ఫుట్‌బాల్ పోటీల్లో ఫ్రాన్స్ జట్టు విజయయాత్ర ...

news

ఫిఫా వరల్డ్ కప్ 2018 : నేటి నుంచి సాకర్ క్వార్టర్ ఫైనల్స్

ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా, నేటి నుంచి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు ...

news

నిజం చెప్పిందనీ అక్టోపస్‌ను చంపేసి అమ్మకానికి పెట్టారు..

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు… జరుగుతున్న ఆట పోటీల్లో ఏదేశం విజయం సాధిస్తుందనేది ముందుగా ...