శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (14:24 IST)

2018 ఆసియా గేమ్స్‌.. 69 పతకాలతో రాణించిన భారత్

ఆసియా గేమ్స్ 2018లో భారత్ 69 పతకాలు సాధించింది. ఇందులో 15 స్వర్ణపతకాలు, 24 రజత పతకాలు, 30 కాంస్య పతకాలున్నాయి. ఏషియన్ గేమ్స్ చివరి రోజు మాత్రం భారత్ రెండు స్వర్ణ పతకాలను ఒక రజత పతకం, ఓ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.  
 
అమిత్ ఫంగల్ పురుషుల 49కేజీల బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, రెండో స్వర్ణాన్ని ప్రణబ్ బర్ధన్-శిబ్‌నాథ్ సర్కార్ సొంతం చేసుకున్నాడు. అలాగే స్క్వాష్ మహిళా జట్టు రజతాన్ని సొంతం చేసుకోగా, కాంస్య పతకాన్ని భారత హాకీ జట్టు పాకిస్థాన్‌ను మట్టికరిపించి.. కైవసం చేసుకుంది. 22 ఓళ్ల ఓల్డ్ ఆర్మీమేన్ అమిత్ ఫంగల్ బాక్సింగ్ ఈవెంట్లో అదరగొట్టాడు. 
 
2010లో భారత్ ఇదే ఆసియా గేమ్స్‌లో 65 పతకాలను సాధించుకుంది. ఇందులో 14 స్వర్ణ పతకాలు వున్నాయి. ఇక ఇండోనేషియాలో జరిగిన 18వ ఏషియన్ గేమ్స్‌లో రెజ్లర్ భజ్‌రంగ్ పూనియా 65 కేజీల విభాగం, పురుషుల ఫ్రీ స్టైల్‌లో స్వర్ణం సాధించాడు. ఇతను 2014లో జరిగిన 61 కేజీల విభాగంలోనూ రాణించి.. పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
ఇక మహిళల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది. ఫలితంగా 50 కేజీల ఫ్రీ స్టైల్ కేటగిరీలో విజేతగా నిలిచింది. జపాన్‌కు చెందిన యూకీ ఐరీని మట్టికరిపించింది. దీంతో ఆసియన్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన భారతీయ ఏకైక రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే అర్పీందర్ సింగ్ కూడా ఆసియన్ గేమ్స్‌లో మెరిశాడు. స్ట్రైక్ ట్రిపుల్ జంప్‌లో 48 సంవత్సరాల తర్వాత భారత్‌కు స్వర్ణం సంపాదించిపెట్టాడు. 
 
అదేవిధంగా భారత్‌కు చెందిన 27 ఏళ్ల ఓల్డ్ మిడిల్- డిస్టన్స్ రన్నర్ జిన్సన్ జాన్సన్ కూడా ఆసియాడ్‌లో రికార్డు సృష్టించాడు. 1500 మీటర్ల ఈవెంట్లో విజయాన్ని సంపాదించుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా జిన్సన్స్ నిలిచాడు. ఇంకా 800 మీటర్ల ఈవెంట్లోనూ జాన్సన్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
ఇక మిగిలిన ఈవెంట్లలో భారత్ పురుషుల జవెలిన్ త్రో, మహిళల 4x400మీ రిలే, పది మీటర్ల ఎయిర్ పిస్టల్ (పురుషుల విభాగం), పురుషుల డబుల్స్ టెన్నిస్, వుమెన్స్ హెప్టాథ్లన్, పురుషుల షాట్ పుట్, పురుషుల 800 మీటర్ల క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది.