సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (17:18 IST)

దేశ భక్తిని నిరూపించుకునేందుకు గొంతు చించుకొని అరిచి నిరూపించుకోవాలా?

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఏ చిన్నపాటి సంఘటన జరిగినా అది టెన్నిస్ తార సానియా మీర్జాపై తీవ్ర ప్రభావం పడుతోంది. తన దేశ భక్తిని నిరూపించుకునేందుకు గొంతు చించుకొని అరిచి నిరూపించుకోవాలా? అంటూ ఆమె నిలదీశారు. 
 
ఇటీవలే పుల్వామాలో ఉగ్రదాడి కారణంగా 42 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దారుణ సంఘటనపై దేశం మొత్తం స్పందించింది. అలాంటి సమయంలో కూడా సానియా తన కొత్త డ్రెస్‌ను చూపిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. 'ఒకపక్క దేశం సైనికులకు కోల్పోయి.. బాధలో ఉంటే.. ఇవ్వు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తావా?' అంటూ ఆమెపై వారు విమర్శల వర్షం కురిపించారు. 
 
పింక్ అండ్ వైట్ కలర్‌లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని... ఆ ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే సానియాకు సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలైంది. తనపై ట్రోలింగ్ చేసే వారికి సానియా మీర్జా తగిన విధంగా సమాధానమిచ్చింది. 
 
"ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో పోస్టులు పెడితేనే సెలబ్రిటీలకు దేశభక్తి ఉంటుందని భావించే వాళ్ల కోసమే ఈ పోస్ట్. మేం సెలబ్రిటీలం కాబట్టి కొందరు వ్యక్తులు మాపై విద్వేషాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. మేం ఉగ్రవాదానికి తీవ్ర వ్యతిరేకం. ఈ విషయాన్ని గొంతు చించుకొని అరవాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి ఒక్కరూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు. లేదంటే అది సమస్య. 
 
నేను నా దేశం కోడం ఆడుతాను. అందుకోసం నా చమట చిందిస్తాను. అనా నేను నా దేశానికి సేవ చేస్తాను. సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా దేశానికి సేవ చేస్తారు. ఇలాంటి విషాదకర సమయంలో జవాన్ల కుటుంబాలకు నేను తోడుగా ఉంటాను. వాళ్లే ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు. 
 
ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే. ఇలాంటి రోజు మరొకటి చూడొద్దని నేను అనుకుంటున్నా. ఈ రోజుని, జరిగిన ఘటనని అంత సులువుగా మర్చిపోలేము. కానీ ఇప్పటికీ ద్వేషానికంటే నేను శాంతిని కోరుకుంటున్నా. ఏదైన ఉపయోకరమైన విషయం జరగడం కోసం ఆగ్రహిస్తే.. అది మంచిది. కానీ జనాలు ట్రోల్ చేయడం ద్వారా కాదు. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు.. ఉండదు కూడా అంటూ సానియా మీర్జా ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.