శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (10:03 IST)

అట్టహాసంగా అశ్విని పొన్నప్ప వివాహం.. కరణ్ మేడప్పతో డుం డుం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. భారత బ్యాడ్మింటన్ స్టార్, అంతర్జాతీయ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప వంతు వచ్చేసింది. అశ్విని పొన్నప్ప వివ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. భారత బ్యాడ్మింటన్ స్టార్, అంతర్జాతీయ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప వంతు వచ్చేసింది. అశ్విని పొన్నప్ప వివాహం కర్ణాటకలో ఘనంగా జరిగింది.
 
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఒకరైన అశ్విని 1989లో జన్మించింది. అశ్విని హైదరాబాదీ స్టార్ గుత్తా జ్వాలతో కలిసి పలు డబుల్స్ మ్యాచ్‌లు ఆడింది. వీరిద్దరూ కలిసి కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం, వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో కాంస్యపతకం సాధించారు. 
 
ఈ నేపథ్యంలోవ్యాపారవేత్త, మోడల్ అయిన కరణ్ మేడప్పను అశ్విని పొన్నప్ప మనువాడారు. కొడుగు జిల్లాలోని కూర్గ్‌లో జరిగిన అశ్విని పొన్నప్ప వివాహానికి సన్నిహితులు, ఇరు కుటుంబీకుల పెద్దలు, స్నేహితులు, ప్రముఖులు తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. కొడవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. కొడవ చీరలో అశ్విని మెరిసిపోయింది. టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోత్స్న చిన్నప్ప ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వీరి వివాహ రిసెప్షన్ విరాజ్‌పేట్‌లో జరుగనుంది.