లవ్ ఫెయిల్యూర్ : తుపాకీతో కాల్చుకుని హాకీ ప్లేయర్ మృతి

గురువారం, 7 డిశెంబరు 2017 (11:27 IST)

rizwan khan

ఢిల్లీలో ఓ విషాదం జరిగింది. ప్రేమలో విఫలమైన జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి రూ.2 లక్షల నగదుతో వెళ్లిన రిజ్వాన్ తన కార్‌లో విగతజీవిగా కనిపించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సరోజని నగర్‌కు చెందిన రిజ్వాన్ ఖాన్ (22) జమియా మిలియా ఉస్మానియాలో చదువుతున్నాడు. జాతీయ స్థాయి హాకీ ఆటగాడు. ఇదే కాలేజీలో చదివే ఓ అమ్మాయిని ప్రేమించసాగాడు. ఆ అమ్మాయి కూడా హాకీ క్రీడాకారిణే. కానీ ఆ అమ్మాయి రిజ్వాన్‌ని దూరంపెట్టి వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ఇటీవల ఆ అమ్మాయి హాకీ ఆడేందుకు భోపాల్ వెళ్లింది. అయితే తనను వెంటనే కలవాలని, లేకుంటే అత్మహత్య చేసుకుంటానని వాట్సాప్‌లో రిజ్వాన్ సందేశం పంపాడు. కానీ ఆ అమ్మాయి ఆ మెసేజ్‌ని పట్టించుకోలేదు. దీంతో బైక్ కొనుగోలు చేసేందుకు వెళుతున్నట్టు ఇంట్లో నుంచి రూ.2 లక్షలు తీసుకుని బయటకు వెళ్లి తనకారులోనే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.
 
అయితే రిజ్వాన్ ఆత్మహత్యకు పాల్పడలేదని, తనను అమ్మాయి కుటుంబసభ్యులే హత్య చేశారని అతని అన్న రియాజుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

మిథాలీ రాజ్ నెక్ట్స్ టార్గెట్ అదేనా? గ్లామర్ ఫోటోలు వెనుక...

ఏం ఇండస్ట్రీలో స్టార్ అయినప్పటికీ సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది ...

news

ఏటీపీ ఫైనల్‌లో ఫెదరర్‌ ఔట్‌.. హాంగ్‌కాంగ్‌కూ శ్రీకాంత్‌ దూరం

స్విస్‌ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సీజన్‌ తుది టెన్నిస్‌ సమరం ఏటీపీ టోర్నీ నుంచి ...

news

సానియాను ఎంతో మిస్ అవుతున్నా.. షోయబ్ మాలిక్ ట్వీట్

భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం (15 నవంబర్) 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ...

news

చైనా ఓపెన్‌ సిరీస్‌‌ నుంచి సైనా నిష్క్రమణ

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నుంచి సైనా నెహ్వాల్‌ ...