Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెడ్‌పై "ఆ" భంగిమలో భార్య.. నిలదీసిన భర్తను చంపి సెప్టిక్ ట్యాంకులో...

గురువారం, 7 డిశెంబరు 2017 (12:54 IST)

Widgets Magazine
murder

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి తమ ఇంట్లోని పడకగదిలో రాసలీలల్లో మునిగితేలుతున్నారు. ఈ దృశ్యాన్ని కట్టుకున్న భర్త చూసి నిలదీశాడు. అంతే, తన ప్రియుడితో కలిసి ఆ మహిళ కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసింది. ఈ దారుణం మహారాష్ట్రలోని పాల్ఘార్ పట్టణంలో వెలుగు చూసింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, పాల్ఘార్ పట్టణానికి చెందిన సవిత భారతి(42) అనే మహిళను ఇటీవల వ్యభిచారం నిర్వహిస్తుందన్న ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను ప్రశ్నించగా, దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. 
 
తనకు కమలేష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉండేదనీ, 13 యేళ్ళ క్రితం తామిద్దరం తన ఇంట్లోనే సన్నిహితంగా ఉండగా భర్త సహదేవ్ చూసి నిలదీశాడు. దీంతో భర్త సహదేవ్‌ను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చేసి సిమెంటుతో కాంక్రీట్ వేసినట్లు ఆమె పోలీసుల దర్యాప్తులో వెల్లడించింది. 
 
భర్తను హతమార్చిన ఆమె, తన భర్త మద్యానికి బానిసై అదృశ్యమయ్యాడంటూ అత్తింటివారిని, బంధువులను, ఇరుగుపొరుగువారిని నమ్మించి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. 
 
కానీ, తాజాగా విచారణలో భారతి తన భర్తను చంపినట్టు తేలింది. దీంతో ఆమె ఇచ్చిన వివరాల మేరకు సెప్టిక్ ట్యాంకులో ఉన్న అస్థిపంజరాన్ని వెలికితీసి దాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కల్యాణ్‌పై రోజా సెటైర్లు.. వారసత్వ సినిమాల సంగతేంటి?

ప్రముఖ సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. ...

news

స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపిస్తా : పందెం కోడి సవాల్

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజక వర్గానికి గాను ఉప ఎన్నిక ...

news

పిల్లలు పుట్టలేదని చిత్ర హింసలు.. అత్త ఎదుటే టెక్కీ కోడలు సూసైడ్

వివాహమై ఐదేళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదనీ భర్త చిత్ర హింసలు పెట్టడం, అత్త చీటిపోటీ మాటలు ...

news

400 ఏళ్ల తర్వాత శాప విముక్తి.. మైసూర్ రాజకుటుంబానికి వారసుడొచ్చాడు..

నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. ...

Widgets Magazine