గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (15:36 IST)

దైవ ప్రార్థనలో భర్తతో పోటీపడలేక భార్య సూసైడ్

కొందరికి తమ ఇష్టదైవమంటే చచ్చేంత ప్రేమ... పిచ్చి. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అంటే అంత విచక్షణమరిచి ప్రవర్తిస్తుంటారు.

కొందరికి తమ ఇష్టదైవమంటే చచ్చేంత ప్రేమ... పిచ్చి. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అంటే అంత విచక్షణమరిచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ వివాహిత దైవప్రార్థనలో తన భర్తతో పోటీపడలేక ఆత్మనూన్యతకులోనై బలవన్మరణానికి పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
తూర్పు గోదావరి జిల్లా జార్జిపేటలోని పల్లంరాజునగర్‌కు చెందిన అద్దంకి గాయత్రిదేవి(20) అనే యువతికి పదిరోజుల కిందట కాకినాడ దూదిమిల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ యాళ్ల సత్యమూర్తితో వివాహమైంది. ఈమె ఏసు భక్తురాలు. భర్త కూడా ఏసు ఆరాధకుడే. వీరిద్దరూ పోటాపోటీగా ఏసు ప్రభువును ఆరాధిస్తూ ప్రార్థనలు చేసేవారు. 
 
ఈ క్రమంలో గాయత్రికి దేవుని ఆరాధనలో భర్త కంటే వెనుకబడిపోయేది. దీన్ని జీర్ణించుకోలేని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు చెబుతుండేది. ఈ క్రమంలో వారు ఎంత నచ్చజెప్పినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ పరిస్థితుల్లో మంగళవారం అమ్మగారింట్లోనే గాయత్రిదేవి ఉరేసుకుంది. 
 
దేవునిపై ఉన్న అమితమైన ప్రేమ వల్లనే గాయత్రిదేవి చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కోరింగ ఎస్‌ఐ సుమంత్‌, తహసీల్దార్‌ ఎల్‌. జోసఫ్‌ గాయత్రి మృతదేహన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.