Widgets Magazine

వేరొకరితో భార్య నవ్వుతూ మాటలు... ముక్కలు ముక్కలుగా నరికిన భర్త...

మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:52 IST)

murder

అనుమానం పెనుభూతంగా మారింది. తన భార్య వేరొకరితో ఒకటిరెండు సార్లు నవ్వుతూ కనిపించింది. అంతే... తన భార్య అతడితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో భర్త అతి దారుణంగా భార్యను గొడ్డలితో నరికి చంపాడు. చంపడమే కాకుండా భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పరారయ్యాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఈ దారుణ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
 
ఎమ్మిగనూరు మండలం కబేళా వీధిలో నివసిస్తున్న పర్వీన్‌ను, సున్నంబట్టీ కాలనీ వాసి బాషాకు ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం చేశారు. బాషా సెంట్రింగ్ పనిచేస్తూ జీవించేవాడు. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. ప్రస్తుతం పర్వీన్ మూడు నెలల గర్భిణి. ఈమధ్య ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడటం, ఆమె కూడా నవ్వుతూ అతడితో మాట్లాడటం గమనించాడు.
 
అంతే... భార్యపై అనుమానం పెంచుకున్నాడు బాషా. దీంతో పర్వీన్ నిద్రిస్తుండగా అర్థరాత్రి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Husband Doubt Wife Axe Affair

Loading comments ...

తెలుగు వార్తలు

news

21న 2జీ కేసు తుది తీర్పు.. రాజా - కనిమొళిలు దోషులా?

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌ కేసులో ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక ...

news

జయలలిత నాన్నకు విషమిచ్చి చంపేశారు.. అమ్మకు ఆడబిడ్డ నిజమే: అత్త లలిత

ముఖ్యమంత్రి దివంగత జయలలిత తొలి వర్థంతి వేడుకలు డిసెంబర్ 5వ తేదీ తమిళనాడు ...

news

జయలలిత వర్థంతి: అనాథగా మారిన అన్నాడీఎంకే.. అమృత ఎంట్రీ ఇస్తారా?

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి నేడు. అమ్మా అంటూ తమిళ ప్రజలచే ...

news

పవన్‌కు ముగ్గురు భార్యలున్నా ఫర్లేదు.. నేను నాలుగో భార్యగా ఉంటా...

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు ఓ ...