శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2017 (13:52 IST)

నా కొడుకు నపుంసుకుడైతే.. నేనున్నాగా... కోడలితో మామ..

సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం చూపిస్తే.. చివరకు ప్రాణాలను దక్కించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభాగ్యురాలికి మరోసారి తేరుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో నిన

సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం చూపిస్తే.. చివరకు ప్రాణాలను దక్కించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభాగ్యురాలికి మరోసారి తేరుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో నిన్న జరిగిన ఈ సంఘటనే రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
గంగాధర నెల్లూరు మండలం మోతరంగపల్లెకు చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌‌కు, అదే మండలం చిన్నదామరకుంటకు చెందిన బాబురెడ్డి కుమార్తె శైలజకు రెండురోజుల క్రితం వివాహమైంది. వివాహమైన తరువాత శోభనం ఏర్పాట్లు చేశారు పెద్దలు. శైలజను శోభనం గదిలోకి పంపిన కొద్దిసేపటికే రాజేష్‌ నపుంశకుడన్న విషయం తెలుసుకుంది శైలజ. దీంతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చేసింది. పెద్దలు మాత్రం ఇదంతా మామూలేనని మళ్ళీ శైలజను గదిలోకి పంపారు. నన్ను నపుంశకుడని పెద్దలకు చెబుతావా అంటూ రాజేష్ ఆమె నోటిలో గుడ్డను కుక్కి అతి దారుణంగా కొట్టాడు. 
బాధితురాలికి నన్నపనేని పరామర్శ
 
చావుబతుకుల మధ్య కేకలు పెడుతూ భర్త నుంచి శైలజ బయటకు పరుగులు పెట్టడంతో బంధువులు గుర్తించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించి ఆమె బాగోగులు చూడాల్సిన భర్త రాజేష్ తండ్రి కుమారస్వామి రెడ్డి వల్గర్‌గా మాట్లాడారు. ఐదు నిమిషాల సుఖం కోసం ఇంత రాద్దాంతం చేయడం అవసరమా. నా కొడుకు నపుంశకుడే.. నిన్ను చూసుకోవడానికి నేనున్నాగా.. ఎందుకింత రాద్దాంతమంటూ కోడలితో అసభ్యంగా మాట్లాడాడు మామ. 
 
కోడలు అంటే కుమార్తెతో సమానం. అలాంటి కోడలితో మామ మాట్లాడిన మాటలు విన్న బంధువులు ఆశ్చర్యపోయారు. కుమారస్వామి రెడ్డిని ఎంత వారించినా ఆయన మాత్రం మాట్లాడటం మానలేదు. దీంతో శైలజను చిత్తూరు ప్రభుత్వాసుప్రతి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శాడిస్ట్ భర్త రాజేష్ మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నాడు. మరి మామను ఏం చేస్తారో చూడాలి. మరోవైపు బాధితురాలిని నన్నపనేని రాజకుమారి పరామర్శించారు.