మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (09:07 IST)

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ద్రోణవల్లి హారిక

dronavalli harika
భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల చెన్నైలో ముగిసిన ప్రపంచ చెస్ ఒలింపియాడ్ పోటీల్లోనూ ఆమె నిండు గర్భంతో పాల్గొన్నారు. తాజాగా తమకు ఆడబిడ్డ పుట్టిందని ఆమె వెల్లడించారు.
 
బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు హారికనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మినిచ్చినట్టు తెలిపింది హారిక.. తమ కుటుంబంలో మరో బుల్లి రాకుమారి చేరిందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. 
 
కాగా, తెలుగు సినీ దర్శకుడు బాబీ సోదరుడు కార్తీక్‌ను హారిక వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 9 నెలల గర్భంతో తన సోదరుడి భార్య బారిక చెస్ ఒలింపియాడ్‌లో పాలుపంచుకున్న విషయాన్ని సినీ దర్శకుడు బాబి వెల్లడించిన విషయం తెల్సిందే.