వింబుల్డన్ సింగిల్స్ రారాజుగా.. నోవాక్ జకోవిచ్.. ఫెదరర్ అవుట్

Last Updated: సోమవారం, 15 జులై 2019 (14:11 IST)
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో సింగిల్స్ రారాజుగా ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్ పోరులో స్విజ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో నోవాక్ జకోవిచ్ తలపడ్డాడు.


వింబుల్డన్ చరిత్రలోనే సుదీర్ఘంగా జరిగిన ఫైనల్లో జకోవిచ్ విజేతగా నిలిచాడు. దాదాపు నాలుగు గంటలా 57 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విజ్ స్టార్ ఫెదరర్ 7-6 (7/5), 1-6, 7-6 (7/4), 4-6, 13-12 (7/3) తేడాతో గెలుపును నమోదు చేసుకున్నాడు. 
 
దీంతో నోవాక్ జకోవిచ్‌పై గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా ఐదో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకోగలిగాడు. గడిచిన 71 ఏళ్లలో మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకొని టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫెదరర్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జకోవిచ్‌ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు.
 
ఇక, ఫెదరర్ 61 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 94 విన్నర్లు కొట్టిన ఫెదరర్, ఆరుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. మరోవైపు జొకోవిచ్‌ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఐదో టైటిల్‌ గెలిచిన జకోవిచ్‌ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దీనిపై మరింత చదవండి :