Widgets Magazine

స్విజ్ మాస్టర్ ఓడిపోయాడా? అదీ అన్‌సీడెడ్ ప్లేయర్ చేతిలోనా?

మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:06 IST)

స్విజ్ మాస్టర్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చుక్కెదురైంది. అదీ అన్ సీడెడ్ ఆటగాడి చేతిలో రోజర్ ఫెదరర్ ఓడిపోయాడు. ఐదుసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన రోజర్ ఫెదరర్.. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో ఖంగుతిన్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో రోజర్ ఫెదరర్ పరాజయం పాలయ్యాడు. 
 
ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు జాన్ మిల్‌మాన్ స్విజ్ మాస్టర్‌ ఫెదరర్‌ను నాలుగు సెట్లు సాగిన మ్యాచ్‌లో ఓడించి సరికొత్త స్టార్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 3-6 తేడాతో కైవసం చేసుకున్న ఫెదరర్, ఆపై మి‌ల్‌మాన్ ధాటికి చేతులెత్తేశాడు. వరుసగా మూడు సెట్లను 7-5-, 7-6, 7-6 తేడాతో మిల్ మాన్ గెలిచాడు. 
 
ఫలితంగా ప్రీ-క్వార్టర్స్‌లో విజేతగా నిలిచాడు. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌లో మిల్‌మాన్, నోవాక్‌ జకోవిచ్‌‌తో బరిలోకి దిగనున్నాడు. నోవాక్ జకోవిచ్‌తోనూ మిల్‌మాన్ మెరుగ్గా రాణించగలడని.. కానీ అతని నుంచి గట్టిపోటీ ఎదుర్కోవలసి వుంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

భారత్ ఖాతాలో మరొకటి.. అమిత్ పంఘాల్ పంచ్‌కు స్వర్ణం

భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. జకర్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడా ...

news

కోర్టులో లోదుస్తులు మార్చుకున్న టెన్నిస్ క్రీడాకారిణి... అంపైర్ ఫైర్

టెన్నిస్ కోర్టులో టెన్నిస్ క్రీడాకారిణి బట్టలు మార్చుకుంది. దీంతో ఆమెపై కోర్టు అంపైర్ ...

news

శభాష్ అమ్మాయిలు... ఆసియా క్రీడల్లో మరో స్వర్ణం...

ఆసియా క్రీడల్లో 12వ రోజు భారతదేశానికి మన క్రీడాకారులు ఏకంగా 5 పతకాలను సాధించిపెట్టారు. ...

news

చాక్లెట్ తింటా.. అందుకే బుగ్గపై ప్లాస్టర్.. ఎవరు?

పంటి నొప్పి రావడంతో బుగ్గపై ప్లాస్టర్ వేసుకుని పోటీలో దిగానని ఆసియా క్రీడల్లో స్వర్ణం ...

Widgets Magazine