Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాజీ హాకీ ప్లేయరైన భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. ఎక్కడ?

సోమవారం, 21 ఆగస్టు 2017 (10:49 IST)

Widgets Magazine

ముంబైలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న తగాదా చిలికిచిలికి గాలివానలా తయారైంది. ఫలితంగా హాకీ మాజీ ఆటగాడైన భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఈ దారుణం ముంబై శివారుల్లోని మలాద్‌లో జరిగింది.  
 
ఈ వివరాలను పరిశీలిస్తే... 52 యేళ్ళ మాజీ హాకీ ఆటగాడు అయ్యప్ప చెనడా, ఈయన భార్య అమితలు మలాద్‌లో నివశిస్తున్నారు. అయితే, వీరిమధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన అమిత.. భర్తను కత్తితో పొడిచి చంపినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. 
 
అయితే హత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేసమయంలో భర్తను హత్య చేసిన భార్యను ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు. ఎందుకంటే.. భార్యాభర్తల మధ్య జరిగిన పెనుగులాటలో ఆమెకు కూడా గాయాలయ్యారు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

దేశానికి ఖ్యాతిని తెచ్చిన ఆ క్రీడాకారిణిని అలా అవమానించారు.. ఏం చేసిందంటే..

పారా ఒలింపిక్స్ వీల్ చైర్ టెన్నిస్ క్రీడాకారిణి మధుబగ్రీకి రేణిగుంట విమానాశ్రయంలో అవమానం ...

news

బ్యాలెన్స్ తప్పింది.. బరువు మొత్తం మెడ భాగంలో పడింది.. తబేత్‌ మృతి

75 కిలోల కేటగిరిలో తబేత్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్‌నెస్ ...

news

భారతీయ వీధుల్లో పశువులు - కోతులే ఉంటాయి.. బాస్కెట్ బాల్ స్టార్

భారత్ గురించి ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చెప్పుకుంటాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ ...

news

రెజ్లర్‌ ప్రాణాలు తీసిన వర్షపు నీరు.. ఎక్కడ?

వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు ...

Widgets Magazine