గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (16:23 IST)

సహచరులతో కలిసి వుండలేకపోతున్నా.. రిషబ్ పంత్

rishabh panth
భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజీల శిక్షణా సెషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులను కలిసిన తర్వాత తాను కోలుకుంటున్నానని, రోజురోజుకూ తన ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. 
 
25 ఏళ్ల అతను గత డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదం నుండి కోలుకుంటున్నాడు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు పంత్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంతా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాలనుకుంటున్నాడు
 
ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.."నేను చాలా బాగా కోలుకుంటున్నాను. నేను నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వచ్చాను. అక్కడ జట్టును కలిశాను. జట్టు ప్రాక్టీస్ ఎలా కొనసాగుతోందో నేను ఇప్పుడే చూశాను. నేను అబ్బాయిలతో కలిసి ఉండటం చాలా ఇష్టం. ప్రస్తుతం నేను దానిని కోల్పోతున్నాను," అంటూ పంత్ చెప్పుకొచ్చాడు.