గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (09:07 IST)

ఫిఫా వరల్డ్ కప్ 2022 - 'గోల్డెన్ బూట్' ఎవరికో తెలుసా?

Kylian Mbappe
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో అర్జెంటీనా అద్భతం చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టు అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. ఫ్రాన్స్ అటగాడు కిలియన్ ఎంబప్పే హ్యాట్రిక్స్ గోల్స్‌తో పోరాటం చేసినా ఫ్రాన్స్‌ను లియోనెల్ మెస్సీ షూటౌట్ చేసింది. ఫలితంగా విశ్వవిజేత కిరీటాన్ని సొంతం చేసుకుంది. 
 
ఒక టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లకిచ్చే గోల్డెన్ బూట్ అవార్డును ఈ సారి ఫ్రాన్స్ హీరో ఎంబప్పే దక్కించుకున్నాడు. ఫైనల్‌కు ముందు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ, ఎంబప్పే చెరో ఐదు గోల్స్‌తో సమ ఉజ్జీలుగా నిలిచారు. అయితే, ఆదివారం జరిగిన తుదిపోరులో మెస్సీ రెండు గోల్స్ కొట్టగా, ఎంబప్పే మూడు గోల్స్‌తో విజృంభించాడు. దీంతో ఎంబప్పే అత్యధికంగా 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ దక్కించుకున్నాడు.