మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (09:41 IST)

బిడ్డకు జన్మనిచ్చాక... పెళ్లికి సిద్ధమైన సెరెనా విలియమ్స్...

అమెరికా నల్లకలువ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. పండంటి పాపకు జన్మనిచ్చాక పెళ్లికి సిద్ధమవుతోంది. గత నెలలో పండంటి పాపకు జన్మనిచ్చి మాతృత్వంలోని మధురానుభూతులను ఆస్వాదిస్తున్న సెరెనా విలియమ్స్.. ఈ న

అమెరికా నల్లకలువ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. పండంటి పాపకు జన్మనిచ్చాక పెళ్లికి సిద్ధమవుతోంది.  గత నెలలో పండంటి పాపకు జన్మనిచ్చి మాతృత్వంలోని మధురానుభూతులను ఆస్వాదిస్తున్న సెరెనా విలియమ్స్.. ఈ నెలాఖరులో వివాహం చేసుకోనుంది. మిలియనీర్ అలెక్సిస్ ఒహానియన్‌తో ఇప్పటికే సెరెనా విలియమ్స్ నిశ్చితార్థం కాగా, ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. పెళ్లి ఏర్పాట్లలో ప్రేమికులిద్దరూ బిజీగా ఉన్నారు.
 
పెళ్లికి పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్న సెరెనా... అలెక్సిస్‌లు ఇందుకు సంబంధించి జాబితాను సిద్ధం చేస్తున్నారు. వెడ్డింగ్ ప్లాన్‌ కోసం ఇద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో న్యూ ఓర్లాండో వెళ్లి అక్కడి మెర్లిన్ రెస్టారెంట్‌లో వెడ్డింగ్ ప్లానర్లతో సమావేశమయ్యారు. ఈ నెలాఖరు, లేదంటే వచ్చే నెల మొదట్లోనే సెరెనా, అలెక్సిస్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.
 
ఇప్పటికే వీరిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. భారీ ఎత్తున అతిథులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కాబోయే భార్యాభర్తలు.. రోజుల పాపను ఇంట్లోనే వదలి ప్రత్యేక విమానంలో న్యూ ఓర్లాండోకు బయల్దేరి వెళ్లారు.