సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (11:14 IST)

సానియా మీర్జా ఆంటీ అయ్యిందోచ్.. మగబిడ్డకు జన్మనిచ్చిన టెన్నిస్ స్టార్

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆంటీ అయింది. ఆమె మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
ఈ ప్రకటన చేయడానికి సంతోషిస్తున్నాన‌ని, తనకు కుమారుడు పుట్టాడని, తన భార్య సానియా కూడా ఆరోగ్యంగా ఉందని, అందరి ఆశీస్సులు, దీవెనలు తనను సంబరానికి గురి చేశాయని షోయెబ్ మాలిక్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
బేబీ మీర్జా మాలిక్ పుట్టాడంటూ షోయెబ్ మేనేజర్ అమీబ్ హక్ కూడా ట్వీట్ చేశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇక తండ్రి ఆనందానికి హద్దులు లేవన్నారు. ఫిల్మ్‌మేకర్ ఫరాహ్ ఖాన్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. సానియా ఆంటీ అయ్యిదంటూ ఖాన్ కామెంట్ చేశాడు.