శ్రియా భూపాల్ పెళ్ళి చేసుకుంది... సీఎం కేసీఆర్ దీవెనలు

శ్రియా భూపాల్ అంటే గుర్తుకు రాక‌పోవ‌చ్చు. అఖిల్ పెళ్లి చేసుకుందామ‌నుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న అమ్మాయి అన‌గానే ఠ‌క్కున గుర్తుకువ‌స్తోంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన త‌ర్వాత అఖిల్ సినిమాల్లో బిజీ అయ్యాడు. శ్రియా భూపాల్ మాత్రం పెళ్లి ప‌నుల్లో బిజ

Shriya Bhupal Wedding
srinivas| Last Modified శనివారం, 7 జులై 2018 (17:39 IST)
శ్రియా భూపాల్ అంటే గుర్తుకు రాక‌పోవ‌చ్చు. అఖిల్ పెళ్లి చేసుకుందామ‌నుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న అమ్మాయి అన‌గానే ఠ‌క్కున గుర్తుకువ‌స్తోంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన త‌ర్వాత అఖిల్ సినిమాల్లో బిజీ అయ్యాడు. శ్రియా భూపాల్ మాత్రం పెళ్లి ప‌నుల్లో బిజీ అయ్యింది. 
 
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు, డిజైనర్ శ్రియా భూపాల్ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. 
 
ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు, రామ్ చరణ్-ఉపాసన దంపతులు, స్నేహారెడ్డి, నమ్రత, లావణ్య త్రిపాఠి తదితరు సినీ ప్ర‌ముఖులు హాజరయ్యారు. ఈ పోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.దీనిపై మరింత చదవండి :