శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: మంగళవారం, 5 జూన్ 2018 (14:20 IST)

కేసీఆర్ లాంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు : ఎల్ఐసీ ఛైర్మన్ వీకే శర్మ

కేసీఆర్ లాంటి దూరదృష్టి గల నాయకుడుని ఎక్కడా చూడలేదని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ సీఎం కేసీఆర్‌కు కితాబిచ్చారు. సీఎం కేసీఆర్‌ కారణంగా తెలంగాణ ప్రజలకు పథకం నిర్వహించే దీవెన ఎల్‌ఐసీకి లభించింది. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారన్న విషయం ఇక్కడ కనిప

కేసీఆర్ లాంటి దూరదృష్టి గల నాయకుడుని ఎక్కడా చూడలేదని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ సీఎం కేసీఆర్‌కు కితాబిచ్చారు. సీఎం కేసీఆర్‌ కారణంగా తెలంగాణ ప్రజలకు పథకం నిర్వహించే దీవెన ఎల్‌ఐసీకి లభించింది. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారన్న విషయం ఇక్కడ కనిపిస్తోంది. నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. నేను కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, వివిధ ప్రాంతాల్లో వివిధ పథకాలను అమలు చేశాను. 
 
కానీ, మొదటిసారిగా రైతుల సంక్షేమం కోసం అద్వితీయ పథకాన్ని ఆలోచించడం చూశాను. రైతుల సంక్షేమం కోసం నిరంతరం తపన పడుతున్నారు. రైతులకు ఆయనే నిజమైన రైతుబంధు అంటూ కొనియాడారు. తెలంగాణ రైతుల అభ్యుదయానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఓ రైతు బిడ్డగా గర్వంగా చెబుతున్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో దూరదృష్టి కలిగిన నాయకుడు ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనే కేసీఆర్‌ అని ముగించారు.