Widgets Magazine

సీఎం కేసీఆర్ హత్యకు ప్లానా? తప్పిన పెను ప్రమాదం

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:58 IST)

Widgets Magazine
kcr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యకు ఎవరైనా కుట్రపన్నారా? అనే అంశం ఇపుడు తెరపైకి వచ్చింది. మంగళవారం ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదిలాబాద్ పర్యటనకు ఆయన బయలుదేరిన హెలికాప్టర్‌లోని ఓ వీహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్‌ ఉన్న బ్యాగు నుంచి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పొగరావడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. హెలికాప్టర్‌లో సెక్యూరిటీ సిబ్బంది వాడే కమ్యూనికేషన్ సెట్‌లో షార్ట్ సర్క్కూట్ కారణంగా పొగలు వచ్చినట్లు తొలుత భావించారు. 
 
అయితే, ఆ బ్యాగును నిశితంగా పరిశీలించగా, సీఎం కాన్వాయ్‌లోని వైర్‌లెస్ సెట్ నుంచే ఈ మంటలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతో అకస్మాత్తుగా పొగలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ గాల్లోకి లేవకముందే బ్యాగ్‌ను బయటపడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
 
ఈ ఘటనపై ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వట్టర్‌లో స్పందించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాను ఫోన్‌లో సంప్రదించానని, సీఎంకి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పారు. సీఎం తన ఆదిలాబాద్ పర్యటనను యధావిధిగా కొనసాగిస్తారని కేటీఆర్ తెలిపారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ భేష్... జపాన్ మంత్రి కితాబు

రియల్ టైమ్ గవర్నెన్స్ విషయంలో కొన్ని అంశాలు జపాన్ దేశాన్ని మించి నిర్వహిస్తున్నారని జపాన్ ...

news

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు సిరియా.. చిన్నారులు కన్నీళ్లు, రక్తపు మరకలతో?

సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అజాద్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారుల మధ్య పోరాటం ...

news

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం అసాధ్యం: సుబ్రహ్మణ్య స్వామి

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు ...

news

డబ్బుల కోసం బెదిరింపులు.. యువతులతో పరిచయం.. ఆపై ఫోటోలు తీసి..

డబ్బుల కోసం ఫోటోలు బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముగ్గురు యువతులపై కేసు నమోదు ...