శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (15:56 IST)

నా లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణం : పీవీ సింధు

తన తదుపరి లక్ష్యం ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించడమేనని హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించారు. ఆమె ఇటీవల బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఆమె హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడెమీలో మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల కల నెలవేరింది. ఈ విజయం కోసం చాలా ఏళ్లు ఎదురు చూశా. విజయం కోసం నాకు ఎల్లవేళలా వెన్నంటి ఉన్న గోపిచంద్‌కి, కిమ్ మేడమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. 
 
ఇక నా తదుపరి లక్ష్యం 2020-టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణం. దీనికోసం చాలా పోటీ ఉంటుందని తెలుసు. కానీ, నా వ్యూహాలు నాకున్నాయి. ఒలంపిక్స్‌కు ముందు చాలా టోర్నీలు ఆడాలి. సూపర్ సిరీస్‌లు ఆడాలి. ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తన టెక్నిక్స్ మెరుగుపరుచుకుంటాను. టాప్-10 ప్లేయర్స్ అందరికీ తమ బలాలు, బలహీనతలు తెలుసు. కావున, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.