మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (14:56 IST)

బీట్‌రూట్‌తో కలర్‌ఫుల్ బర్ఫీ ఎలా చేయాలి...?

బాణలిలో నెయ్యి పోసి వేడయ్యాక బీట్‌రూట్, పాలు పోసి సన్నని సెగపై బాగా ఉడికించాలి. బీట్‌రూట్ తురుము బాగా ఉడికాక.. అందులో నట్స్, ఖర్జూరం తురుమును చేర్చి బాగా కలపాలి. బాగా చిక్కబడ్డాక సర్వింగ్ బౌల్‌లోకి తీ

అధిక రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌ రసాన్ని తాగాలి. బీట్‌రూట్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుంది. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా కోలుకుంటారు. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా వుంటాయి.


శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం బీట్‌రూట్‌లో ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పెద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే పిల్లలు బీట్‌రూట్‌ను తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకు అదే బీట్‌రూట్‌తో కలర్‌ఫుల్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ తురుము - ఒక కప్పు 
ఖర్జూర పండ్లు-  50 గ్రాములు 
జీడిపప్పు ముక్కలు- పావు కప్పు 
బాదం పలుకులు- పావు కప్పు  
పాలు - అర లీటరు 
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
అలంకరణకు - నట్స్ ఓ టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం: 
బాణలిలో నెయ్యి పోసి వేడయ్యాక బీట్‌రూట్, పాలు పోసి సన్నని సెగపై బాగా ఉడికించాలి. బీట్‌రూట్ తురుము బాగా ఉడికాక.. అందులో నట్స్, ఖర్జూరం తురుమును చేర్చి బాగా కలపాలి. బాగా చిక్కబడ్డాక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని నట్స్‌తో గార్నిష్ చేసుకుని వేడివేడిగా కాకుండా ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి.. సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఈ మిశ్రమాన్ని బర్ఫీల్లా కట్ చేసుకుని నట్స్‌తో అలంకరించుకుని పిల్లలకు స్నాక్స్ బాక్సులో నింపి పంపితే ఇష్టపడి తింటారు.