బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 మార్చి 2024 (17:46 IST)

రుచికరమైన క్యారెట్ హల్వా వంటకం ఎలా చేయాలో తెలుసా?

carrot halwa
పిల్లలు చిరుతిండ్లు కోసం ఏవో కొని వాటిని తిని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటుంటారు. అలాంటి సమస్యలు రాకుండా వారికోసం ఇంట్లోనే రుచికరమైన వంటకాలు చేసుకుంటే వారి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇలాంటి వంటకాల్లో క్యారెట్ హల్వా ఒకటి. హోలీ పండుగ సందర్భంగా ఈ స్వీట్ క్యారెట్ హల్వా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము.
 
కావాల్సిన పదార్థాలు ఏమిటంటే మూడుంపావు కప్పుల పాలు, 6 క్యారెట్లు, 7 యాలకులు.
3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 5 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 4 టేబుల్ స్పూన్ల బాదం పప్పులు.
తయారుచేసే పద్ధతి ఎలాగంటే మందంగా ఉండే పాన్‌లో పాలను మరగబెట్టాలి.
అందులో క్యారెట్ తురుము, యాలకుల పొడులను వేసి కలియబెట్టాలి.
సన్నని సెగపై ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఉడికించాలి.
నీరంతా ఇగిరిపోయాక నెయ్యి, పచదార, కిస్మిస్, బాదంపప్పుల పలుకులు వేసి మరో 5 నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
ఇలా సిద్ధమైన క్యారెట్ హల్వాను వేడిగానూ లేదా చల్లార్చి ఎవరిష్టానుసారం వారు తినవచ్చు.