శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : గురువారం, 7 మే 2015 (18:26 IST)

ఓట్స్ అండ్ కోకోనట్ పాయసం ఎలా చేయాలి?

ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటంతో బరువు తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే టెంకాయ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. అలాగే శరీరంలోని వైరల్, ఫంగస్, బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది. ఇందులోని ఫాటీ యాసిడ్స్ మెదడు సంబంధిత వ్యాధులను దూరం చేయడంతో పాటు అల్జీమర్స్‌ను దరిచేరనివ్వదు. అలాంటి ఓట్స్ అండ్ కోకోనట్ కాంబినేషన్‌లో పాయసం చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
ఓట్స్ - రెండు కప్పులు 
కోకోనట్ తురుము - రెండు కప్పులు 
నెయ్యి - నాలుగు స్పూన్లు 
జీడిపప్పు - పావు కప్పు 
పంచదార - రెండు కప్పులు 
యాలకుల పొడి - ఒక స్పూన్  
 
తయారీ విధానం :
ముందుగా ఓ పాన్‌లో నెయ్యిని వేడిచేసుకుని జీడిపప్పు, నచ్చితే ఎండుద్రాక్ష, పిస్తా పప్పులను దోరగా వేయించుకుని ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత ఓట్స్, కోకోనట్ తురుమును అదే పాన్‌లో వేసి నాలుగు కప్పుల నీటిని చేర్చి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత పంచదార చేర్చి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ ఓట్స్ మిశ్రమానికి నేతిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా, బాదం పప్పులతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..