వారంతా ఆరుసార్లు గెలిచారు.. కిషన్ రెడ్డి ఓటమి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు కారుకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా తెరాస విజయభేరీ మోగించింది. తెరాస చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటర్లు ఓటు వేశారు. ఫలితంగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పలుపలుచోట్ల అభ్యర్థలను భారీ మెజార్టీతో గెలుపొందిస్తే.. కొందరికి వరుస విజయాలను కట్టబెట్టారు. పలువురు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు.
వీరిలో హరీశ్ రావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లు ఆరుసార్లు గెలిచినవారిలో ఉన్నారు. మంత్రి హరీశ్ రావు లక్షకుపైగా మెజారిటీతో విజయం సాధించడం విశేషం. అయితే, మరో నలుగురు మంత్రులు, సభాపతి, ప్రతిపక్ష నేత ఓటమిపాలయ్యారు. మంత్రులు తుమ్మల, జూపల్లి, మహేందర్ రెడ్డి, చందూలాల్ ఓటమిపాలవ్వగా.. సభాపతి మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ఓడిపోయారు.
అదేవిధంగా అంబర్ పేట నుంచి పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఇకపోతే, కూకట్‌పల్లి స్థానం నుంచి పోటీ చేసిన నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని కూడా ఓడిపోయారు.